ఎన్టీఆర్ ఇచ్చిన సలహా నాకు ఎంతో మేలు చేసింది: చిరంజీవి

ఆ రోజుల్లో దివంగత నందమూరి తారకరామారావు ఇచ్చిన సలహా తనకు ఎంతగానో

By Medi Samrat
Published on : 20 Jan 2024 9:43 PM IST

ఎన్టీఆర్ ఇచ్చిన సలహా నాకు ఎంతో మేలు చేసింది: చిరంజీవి

ఆ రోజుల్లో దివంగత నందమూరి తారకరామారావు ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆర్థిక సలహాలు నాపైనా, నా కుటుంబంపైనా చాలా ప్రభావం చూపించాయని చిరంజీవి అన్నారు. వైజాగ్‌లో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి, ఏఎన్‌ఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లపై తనకున్న అభిమానాన్ని చిరంజీవి చాటుకున్నారు. తనకు ఫ్యాన్సీ కార్లంటే మోజు ఉండేదని.. రెక్కల తరహా డోర్లు ఉండే టయోటా కారుపై నా దృష్టి ఉండేది. ఎన్టీఆర్ గారు అల్యూమినియం ఫాయిల్ వాహనాలపై పెట్టుబడి పెట్టవద్దని, భూములు కొనుక్కోమని సలహా ఇచ్చారన్నారు. నేను ఆ రోజు ఎన్టీఆర్ మాటలు నమ్మి భూమిని కొన్నాను, అది ఇప్పుడు నన్ను, నా కుటుంబానికి ఎంతో మంచి చేసింది. ఆయన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని చిరంజీవి అన్నారు. తన జీవిత చరిత్రను రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన ఆత్మకథపై పనిచేయడానికి తనకు సమయం లేదని, అందుకే దానిని నిర్వహించే బాధ్యతను యండమూరికే వదిలేశానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేశారు.


Next Story