ఎన్టీఆర్ 30.. యంగ్ టైగ‌ర్ లుక్ అదుర్స్‌

NTR 30th movie look goes viral. ఎన్టీఆర్ 30వ చిత్రం, నేడు(మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆయ‌న లుక్‌ను రివీల్ చేస్తూ.. ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది చిత్ర‌బృందం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 3:09 AM GMT
Jr NTR

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. నేడు(మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆయ‌న లుక్‌ను రివీల్ చేస్తూ.. ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్ స్మార్ట్ లుక్‌లో ఇన్‌ష‌ర్ట్ చేసుకుని క్లాసీ, ప్రొషెష‌న‌ల్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ అభిమానుల‌కు ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ మ‌రో క‌థానాయ‌కుడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. క‌రోనా కార‌ణంగా వాయిదా వేశారు. ఈ చిత్రం పూర్తి అయిన వెంట‌నే ఎన్టీఆర్‌.. కొర‌టాల శివ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించ‌నున్నారు.
Next Story