NTR 30 : ఎన్నాళ్లుగానో వేచిన ఉద‌యం.. వ‌చ్చేసింది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2023 12:26 PM IST
NTR 30, Koratala Siva

క్లాప్ కొడుతున్న జ‌క్క‌న్న‌


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ఎన్టీఆర్ కొత్త సినిమా మొద‌లైంది. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. గురువారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర బృందం ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌, జాన్వీక‌పూర్‌, ప్ర‌కాశ్ రాజ్‌, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌, నిర్మాత క‌ల్యాణ్ రామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్య‌క్ర‌మం అనంత‌రం నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డి చిత్ర‌బృందాన్ని స్క్రిప్ట్ అంద‌జేశారు. ఎన్టీఆర్‌-జాన్వీక‌పూర్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు షాట్‌కు జ‌క్క‌న్న క్లాప్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మార్చి చివరివారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండ‌డంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. డిసెంబ‌ర్ నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టాల‌ని బావిస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఎన్టీఆర్ 30 పూజా కార్య‌క్ర‌మంలో జాన్వీ క‌పూర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. త‌న అభిమాన న‌టుడు ఎన్టీఆర్‌ని క‌లిసిన స‌మ‌యంలె ఆమె ఆనందం మ‌రో స్థాయిలో ఉంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్ర తెర‌క్కుతోంది.

Next Story