సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్‌ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. 'పుదుకొట్టయిరుందు శరవణన్', 'ఏప్రిల్ మంత్', 'ఈస్ట్‌కోస్ట్ రోడ్' వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్నీ పలు హిట్ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన 'మహారజ' సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు.
2000లలో తమిళ సినిమాల్లో చాలా ప్రజాదరణ పొందిన దర్శకుల్లో స్టాన్లీ ఒకరు. దర్శకులు మహేంద్రన్, శశిల వద్ద శిక్షణ పొందిన స్టాన్లీ.. 12 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్టాన్లీ 2002లో తన మొదటి చిత్రం ఏప్రిల్‌ను దర్శకత్వం వహించి విడుదల చేశాడు. శ్రీకాంత్, స్నేహ నటించిన ఈ చిత్రం యువతలో భారీ విజయాన్ని సాధించింది. దీని ద్వారా, అతను తన మొదటి సినిమాలోనే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించాడు. ప్రసిద్ధి చెందాడు.