నోరా ఫతేహీ కూడా లేటెస్ట్ గా బాధితురాలే
నోరా ఫతేహి డీప్‌ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ
By Medi Samrat Published on 20 Jan 2024 6:37 PM ISTరష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తర్వాత.. నోరా ఫతేహి డీప్‌ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ నోరా మార్ఫింగ్ వీడియో వైరల్ అవుతోంది. నోరా తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో వీడియో స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది. భారతదేశంలో డీప్‌ఫేక్ కేసులు బాగా పెరిగిపోతుంది. వైరల్ క్లిప్ నోరా ఫతేహీ ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. వీడియో చాలా పర్ఫెక్షన్‌తో చేశారు. నోరా వాయిస్ నుండి ఆమె బాడీ లాంగ్వేజ్ వరకు, ప్రతిదీ అచ్చం నోరా చేసినట్లుగానే వీడియోను క్రియేట్ చేసారు. షాకింగ్ గా అనిపిస్తూ ఉంది.. ఇందులో ఉన్నది నేను కాదు అంటూ నోరా ఫతేహీ పోస్టు పెట్టింది.
నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీడియో సృష్టికర్తగా అనుమానిస్తున్న నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చామని, అతన్ని విచారిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. నవంబర్ 10న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆద్వర్యంలోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 465 (ఫోర్జరీకి శిక్ష), 469 (పరువుకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C, 66E కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన నిందితులను గుర్తించేందుకు యూఆర్‌ఎల్, ఇతర వివరాలను పొందేందుకు ఐఎఫ్‌ఎస్‌ఓ మెటాకు లేఖ రాసింది.
Next Story