'నా పరువు పోయింది'.. హీరోయిన్‌పై కేసు వేసిన మరో హీరోయిన్‌

Nora Fatehi defamation case against to Jacqueline Fernandez in sukesh chandrasekhar case. బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి పరువు నష్టం దావా వేశారు.

By అంజి  Published on  13 Dec 2022 9:39 AM IST
నా పరువు పోయింది.. హీరోయిన్‌పై కేసు వేసిన మరో హీరోయిన్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి పరువు నష్టం దావా వేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ "ద్వేషపూరిత కారణాల వల్ల తనపై పరువు నష్టం కలిగించే మాట్లాడరని" నోరా ఫతేహి ఆరోపించింది. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో తన పేరుని కావాలనే జాక్వెలిన్‌ లాగుతోందని, తన పరువుతీస్తోందంటూ నోరా వాపోయింది. మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టులో దాఖలు చేసిన లిఖితపూర్వక పిటిషన్ లో జాక్వెలిన్​ ఫెర్నెండేజ్​ ప్రస్తావించిన పలు అంశాలపై నోరా ఫతేహీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

''జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సొంత ప్రయోజనాల కోసం తన కెరీర్‌ను నాశనం చేయడానికి నేరపూరితంగా పరువు తీయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మేం ఇద్దరం ఒకే పరిశ్రమలో పనిచేస్తున్నాం. ఇతర కారణాలతో సమానమైన నేపథ్యాలు కలిగి ఉన్నారు" అని నోరా ఫతేహి తన అభ్యర్ధనలో పేర్కొంది. కాగా నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది.

పీఎంఎల్‌ఏ కోర్టులో జాక్వెలిన్ లిఖితపూర్వకంగా చేసిన అభ్యర్థనపై నోరా ఫతేహి పరువునష్టం కేసును దాఖలు చేసింది. ''తనను ఈడీ తప్పుగా చూస్తోంది. అయితే కాన్‌మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి బహుమతులు పొందిన నోరా ఫతేహి వంటి ప్రముఖులు సాక్షులుగా ఉన్నారు.'' అని జాక్వెలిన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే నటి నోరా ఫతేహి ఆ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనకు నేరుగా సుకేష్ చంద్రశేఖర్‌తో ఎలాంటి పరిచయం లేదని, అతని భార్య లీనా మారియా పాల్ ద్వారా మాత్రమే పరిచయం ఉందని తెలిపింది. కాన్‌మ్యాన్ నుండి ఎలాంటి బహుమతులు అందుకోలేదని నోరా తెలిపింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో పాటు, నోరా ఫతేహి తన పరువు నష్టం పిటిషన్‌లో పలు మీడియా సంస్థల పేర్లను కూడా పేర్కొంది.

Next Story