'రాధేశ్యామ్' రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇదే

No Change in Radhe Shyam movie Release Date.దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా చిత్రాలు విడుదలను

By M.S.R  Published on  3 Jan 2022 7:21 AM GMT
రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా..  క్లారిటీ ఇదే

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చాలా చిత్రాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. హిందీలో కొన్ని సినిమాలు, అలాగే 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇప్పటికే వాయిదా పడింది.ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' రిలీజ్ కూడా వాయిదా పడబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ''రాధేశ్యామ్" రిలీజ్ ప్లాన్స్ లో ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పు లేదు. జనవరి 14న విడుదల అయ్యేందుకు సినిమా సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు సంబంధించి వస్తున్న రూమర్లను నమ్మొద్దు" అని ట్విట్టర్ ద్వారా యూనిట్ తెలిపింది.

దీన్ని బట్టి రాధేశ్యామ్ సంక్రాంతికి వస్తుందని తెలుస్తోంది. అయినా ఇంకా రెండు వారాల టైమ్ ఉండగా.. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయం కూడా ఉంది. సంక్రాంతి 2022 కు రిలీజ్ చేయాలని భావించిన రాధేశ్యామ్ మేకర్స్ తాము చెప్పిన తేదీకి విడుదల చేయనున్నారు. జనవరి 14న సినిమాని రిలీజ్ చేస్తున్నామని చెప్పిన తర్వాత వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రాబోతుండడంతో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలోకి కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని విధించాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడుతున్నాయి. ముంబయిలో కరోనా ఆంక్షలు వచ్చిన నేపథ్యంలో డిసెంబరు 31న విడుదల కావాల్సిన 'జెర్సీ' రీమేక్ నూ నిర్మాతలు వాయిదా వేశారు. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేశారు.

Next Story
Share it