పాలు పితికిన నివేదా.. వీడియో వైర‌ల్‌

Nivetha Thomas Shared video goes viral.సినీ తార‌లు ఏం చేసినా కూడా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. తాజాగా నివేదా థామ‌స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sep 2021 7:37 AM GMT
పాలు పితికిన నివేదా.. వీడియో వైర‌ల్‌

సినీ తార‌లు ఏం చేసినా కూడా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. తాజాగా నివేదా థామ‌స్ చేసిన ఓ ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ నివేదా ఏం చేసింద‌ని అంటారా..? పాలు పితికింది. అవును ఇది నిజం. ఇందుకు సంబంధించిన వీడియోను నివేదా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ డైరీ ఫామ్‌కు వెళ్లిన నివేదా బ్లాక్‌ కలర్‌ జాకెట్‌ ధరించి ఆవు పాలు పితికింది. అనంత‌రం స్వ‌యంగా చ‌క్క‌టి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్ అనే ట్యాగ్ చేసింది. ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పాలు పితికే సాహ‌సం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అంటూ కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

నివేదా.. ఇక రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో రెండు, మూడు చిత్రాలు ఉన్నాయి.

Next Story