నివేదాకు చేదు అనుభ‌వం.. భోజ‌నంలో బొద్దింక‌

Nivetha Pethuraj lashed out at Swiggy.ప్ర‌స్తుతం అంతా ఆన్‌లైన్ ద్వారానే న‌డుస్తోంది. ఏం కావాల‌న్నా ఆన్‌లైన్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 2:26 PM IST
నివేదాకు చేదు అనుభ‌వం.. భోజ‌నంలో బొద్దింక‌

ప్ర‌స్తుతం అంతా ఆన్‌లైన్ ద్వారానే న‌డుస్తోంది. ఏం కావాల‌న్నా ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే చాలు వెంట‌నే అది మ‌న ముందుకు వ‌స్తుంది. ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలంలో బ‌య‌టికి వెళ్లేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌డం లేదు. న‌చ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్ ద్వారా ఇంటికే తెప్పించుకుని తింటున్నారు. ప్రముఖ డెలివరీ సంస్థ‌లు సేవ‌లు అందించేందుకు ఎల్ల‌ప్పుడూ సిద్దంగా ఉంటున్నాయి. అలాగే.. ఓ ప్రముఖ పుడ్ డెలీవ‌రీ యాప్‌లో త‌న‌కు న‌చ్చిన పుడ్ ను ఆర్డ‌ర్ చేసింది న‌టి నివేదా పేతురాజ్‌. ఆ పుడ్ ఆర్డ‌ర్ అందుకున్నాక ఎంచ‌క్కా లాంగించేద్దామ‌ని అనుకుంటుండ‌గా.. మూత తీసి షాక్‌కు గురైంది. ఎందుకంటే.. దానిలో ఓ బొద్దింక క‌నిపించింది. దీంతో అమ్మ‌డు స‌ద‌రు పుడ్ డెలీవ‌రీ సంస్థ‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది.

హోట‌ళ్లు స‌రిగ్గా ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డం లేదు అన‌డానికి ఇదొక ఉదాహార‌ణ‌. నేను ఆర్డ‌ర్ చేసిన భోజ‌నంలో బొద్దింక వ‌చ్చింది. ఇలా జ‌ర‌గ‌డం ఇది రెండోసారి. వినియోగ‌దారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోట‌ళ్ల‌పై భారీ జ‌రిమానా విధించాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేసింది.

కాగా.. స‌ద‌రు ట్వీట్‌కు సిగ్గి కూడా స్పందించింది. మేము క్వాలిటీ విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌మ‌ని చెప్పూనే.. ఆర్డ‌ర్ ఐడీ చెబితే.. అది ఏ రెస్టారెంట్ నుంచి వ‌చ్చిందో ప‌రిశీలించి చ‌ర్య తీసుకుంటామ‌ని ట్వీట్ చేసింది.


'ఓరు నాల్ కొథు' అనే త‌మిళ చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంత‌రం తెలుగులో 'మెంటల్ మదిలో', 'పెళ్ళిరోజు', 'టిక్ టిక్ టిక్', 'చిత్రలహరి', 'బ్రోచేవారెవరురా' వంటి సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా ట్రై చేసినా..పెద్ద‌గా క‌లిసిరాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్‌గా 'అల వైకుంఠ పురంలో', 'రెడ్‌'లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు విశ్వ‌క్ సేన్ స‌ర‌స‌న 'పాగ‌ల్' చిత్రంలో న‌టిస్తోంది.

Next Story