షాక్ ఇచ్చిన నిత్యామీన‌న్‌.. పెళ్లికాకుండానే తల్లి అవుతోందా?

Nithya Menen share pregnancy test kit results on social media.త్యా మీన‌న్‌.. ప‌రిచ‌యంచేయాల్సిన అవ‌స‌రం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2022 11:29 AM IST
షాక్ ఇచ్చిన నిత్యామీన‌న్‌.. పెళ్లికాకుండానే తల్లి అవుతోందా?

నిత్యా మీన‌న్‌.. ప‌రిచ‌యంచేయాల్సిన అవ‌స‌రం లేదు. టాలెంటెడ్ యాక్ట్రెస్. ప‌రిశ్ర‌మలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ అంద‌రి మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేస్తోంది. అయితే.. తాజాగా అమ్మ‌డు అంద‌రికి షాకిచ్చింది. తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అంతేనా.. అద్భుతం మొద‌లైంది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఇంత వ‌ర‌కు పెళ్లి చేసుకోని నిత్యామీన‌న్‌.. తల్లి ఎలా అయ్యిందంటూ అభిమానులు క‌న్‌ప్యూజ్ అవుతూ నిజ‌మా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


కాగా.. ఇదే ఫోటోను మ‌ల‌యాళ న‌టి పార్వ‌తి కూడా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. న్ని చూసి గాయని చిన్మయి శ్రీపాద, నటి స్వరా భాస్కర్, నిర్మాత గునీత్ మోంగా అభినందనలు చెప్పారు. అస‌లు విష‌యం ఏమిటంటే.. వీరిద్ద‌రూ గ‌ర్భ‌వ‌తులు కాలేదు. ఓ చిత్ర ప్ర‌మోష‌న్ కోసం ఇలా షేర్ చేశార‌ని తెలుస్తోంది. సరిగ్గా ఇదే విధమైన ఫొటో, క్యాప్షన్ ను నటి పద్మప్రియ, సయనోరా ఫిలిప్ కూడా పోస్ట్ చేయడం గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి.

Next Story