నితిన్ 'మాస్ట్రో'.. ఫ‌స్ట్‌లుక్ వైర‌ల్‌

Nithiin Maestro First Look Released.నితిన్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న 'మాస్ట్రో'.. ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2021 11:20 AM IST
Maestro First Look Released

మెర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో నితిన్ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. నితిన్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన హిందీ చిత్రం 'అంధాధూన్' రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సుధాక‌ర్‌రెడ్డి, నికిత రెడ్డి నిర్మాత‌లు. నితిన్‌కి జోడిగా న‌భా న‌టేష్ న‌టిస్తోండ‌గా.. త‌మ‌న్నా ఓ ముఖ్య పాత్ర‌ని పోషిస్తోంది. ఇక నేడు(మంగ‌ళ‌వారం) నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్ట‌ర్‌ను చేశారు. ఈ చిత్రానికి మాస్ట్రో పేరుని ఖ‌రారు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

పోస్టర్ లో నితిన్ లుక్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. జీన్స్ దానిపై సూట్ ధరించి చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఆ కళ్లకు నల్లద్దాలు ధరించిన తీరు చూస్తుంటే అతడు అంధుడు అని అర్థమవుతోంది. ఆసక్తికరంగా బ్యాక్ గ్రౌండ్ లో పియానోపై రక్తపు మరకలు చూడగానే ఇది మ్యూజిక్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ అనే సందేహాలు మొద‌ల‌య్యాయి. ఈ సినిమా కథాంశం కథానాయకుడి అంధత్వ లోపం.. లవ్ ఎమోషన్ అనే ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది. భీష్మ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన మహతి స్వరా సాగర్ రెండవసారి నితిన్ తో కలిసి పని చేస్తున్నారు. జూన్ 11 న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




Next Story