మాచర్ల నియోజకవర్గం.. ఫస్ట్ అటాక్ గ్లింప్స్.. అదిరిపోయింది

Nithiin Macherla Niyojakavargam First Attack.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 7:07 AM GMT
మాచర్ల నియోజకవర్గం.. ఫస్ట్ అటాక్ గ్లింప్స్.. అదిరిపోయింది

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. అందులో ఒక‌రు కృతి శెట్టి కాగా.. మ‌రొక‌రు కేథ‌రిన్. నేడు నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం విషెస్ తెలియ‌జేస్తూ ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది.

ఈ టీజ‌ర్ అదిరిపోయింద‌నే చెప్పాలి. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు టీజర్ ను బ‌ట్టి తెలుస్తోంది. నితిన్ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా ఓ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జులై 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం తెలియ‌జేసింది.

ఇటీవ‌ల నితిన్ న‌టించిన 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' చిత్రాలు అంత‌గా అల‌రించ‌లేక‌పోయాయి. మ‌రీ ఈ చిత్రంతోనైనా బ్లాక్ బాస్ట‌ర్ ను హిట్‌ను నితిన్ అందుకుంటాడో లేదో చూడాలి మ‌రీ.

Next Story
Share it