19న 'చెక్' పెట్టనున్న నితిన్

Nithiin Check movie release date out.టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం 'చెక్‌' విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2021 7:21 PM IST
Nithin latest movie release date

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం చెక్‌. క్రియేటివ్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల‌ర్ల్ చిత్రం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 19న 'చెక్' ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ ద్వారా హీరో నితిన్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగించాయి. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.


అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తారని ఈ మధ్య రూమర్స్ వినిపించాయి. తాజాగా మేకర్స్ 'చెక్' సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి వీటికి చెక్ పెట్టారు. జైలు నేపథ్యంలో ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఆధ్యంతం ఆసక్తికరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందిందని చిత్ర యూనిట్ తెలిపింది. నితిన్ నటించిన 'రంగ్ దే' చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story