ప్రెగ్నెన్సీ వార్త‌ల‌పై న‌టి నిక్కీ గల్రానీ సీరియ‌స్‌.. 'డెలివ‌రీ డేట్ కూడా చెప్పేయండి'

Nikki Galrani Pinisetty reveals if she is pregnant or not.నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి లు కొన్నాళ్లు ప్రేమ‌లో ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 9:07 AM IST
ప్రెగ్నెన్సీ వార్త‌ల‌పై న‌టి నిక్కీ గల్రానీ సీరియ‌స్‌.. డెలివ‌రీ డేట్ కూడా చెప్పేయండి

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వ్య‌క్తుల గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా తాము అభిమానించే హీరో, హీరోయిన్లు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకునేందుకు తెగ ఉబ‌లాట‌ప‌డిపోతుంటారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్పుడు అస‌లు వార్త ఏదో న‌కిలీ వార్త ఏదో తెలుసుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. ఓ సినీ జంట త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆ వార్త‌లు కాస్త స‌ద‌రు హీరోయిన్ కి చేర‌డంతో కాస్త గ‌ట్టిగానే స్పందించింది. ఇంకెందుకు ఆల‌స్యం డెలివ‌రీ డేట్ కూడా మీరే చెప్పేయండి అంటూ మండిప‌డింది.

కోలీవుడ్ న‌టులు నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి లు కొన్నాళ్లు ప్రేమ‌లో ఉన్న త‌రువాత ఈ ఏడాదిలో వివాహ బంధంతో ఒక్క‌టి అయ్యారు. ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో, ప‌లు వెబ్‌సైట్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై నిక్కీ గల్రానీ స్పందించింది. తాను ప్రెగ్నెంట్‌ కాదని చెప్పింది." ప్ర‌స్తుతం నేను ప్రెగ్నెంట్ కాదు. దీన్ని భ‌విష్య‌త్తులో బ్రేక్ చేస్తా.. ద‌య‌చేసి రూమ‌ర్లు న‌మ్మ‌కండి" అని అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. "ఇంకెందుకు ఆల‌స్యం డెలివ‌రీ డేట్ కూడా మీరే చెప్పయండి" అంటూ న‌వ్వుతున్న ఎమోజీని జ‌త చేసింది.

'మ‌లుపు' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ద‌గ్గ‌రైంది ఈ క‌న్న‌డ భామ‌.

Next Story