అంచ‌నాల‌ను పెంచుతున్న నిఖిల్ '18 పేజెస్‌'

Nikhil 18 pages pre look hypes curiosity.యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం 18 పేజెస్. సుకుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2021 7:36 AM IST
అంచ‌నాల‌ను పెంచుతున్న నిఖిల్ 18 పేజెస్‌

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ నిఖిల్ పుట్టిన రోజు జూన్ 1 విడుద‌ల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

నిఖిల్ సిగ‌రెట్ తాగుతూ చేతిలో పేప‌ర్ ను అంటించగా..దానిపై జూన్ 1న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంటూ చూపించ‌డం కొత్త‌గా ఉంది. ప్రీ లుక్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. డార్క్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న '18 పేజెస్' కొత్త పోస్ట‌ర్ క్యూరియాసిటీని పెంచుతుంది. . గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

Next Story