పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని.. నిహారిక హాట్ కామెంట్లు

Niharika Fires On Posani Krishna Murali

By Medi Samrat  Published on  29 Sep 2021 7:45 AM GMT
పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని.. నిహారిక హాట్ కామెంట్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని టీడీపీ నేతలు తిడితే పవన్ కళ్యాణ్ ఎటు పోయారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వారు తిడితే.. తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా పోసాని మాట్లాడారు. పవన్, ఆయన అభిమానులు సైకోలని అన్నారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. కొట్టడానికి కూడా ప్రయత్నించారు. పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పోసాని కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు. ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేసేందుకు ఉద్దేశ‌పూర్వకంగానే వైసీపీ పోసానిని దించింద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

ఇక పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల పట్ల నాగబాబు కుమార్తె నిహారిక మండిపడింది. ఆయనో మెంటల్ వ్యక్తి అని, వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నాగబాబు 'ఆస్క్‌ మీ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ముందుకు వచ్చారు. 'మళ్లీ పాలిటిక్స్‌లో వ స్తారా అంకుల్‌' అనే ప్రశ్నకు... 'నాకు ఇంట్రెస్ట్‌ పోయింది' అనే మీమ్‌తో ఆన్సర్‌ ఇచ్చారు. 'పవన్‌ కళ్యాణ్‌ మేటర్‌ మాట్లాడు అన్నా' అని ఓ అభిమాని అడిగితే... గతంలో పవన్‌ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియో పోస్ట్‌ చేశారు. ''పవన్‌కల్యాణ్‌ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్‌ చేస్తానంటే.. నేను అతనికి బ్లాంక్‌ చెక్‌ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. కోటా, రెండు కోట్లా, పది కోట్లా, ఇరవై కోట్లా, 30 కోట్లా! 40 కోట్లు కూడా ఇస్తా. నాకు డేట్స్‌ ఇస్తే. అంత డిమాండ్‌ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు. అతను ఐదు కోట్లు, పది కోట్ల కోసం లంగా పనులు చేయడు. నాకు తెలుసు'' అని అందులో పోసాని అన్నారు. నాని గురించి చెప్పు! అని అడగ్గా.. 'నేనేం చెప్పాలి. దేశంలో ఈ అవార్డులనేవి వస్తే ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులూ రావాలి. ఆస్కార్‌కు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయ్యప్పస్వామి సాక్షిగా అటువంటి పర్ఫార్మెన్స్‌ చూడలేదు' అని 'గుండెల్లో గోదావరి' ఆడియో వేడుకలో మోహన్‌బాబు వీడియో పోస్ట్‌ చేశారు. పోసాని గురించి ఒక్క మాట! అని అడగ్గా 'సమరసింహారెడ్డి'లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్‌... 'కుక్కపిల్ల మొరిగిందనుకో'! అలా చెప్పాలని చూశారు నాగబాబు.


Next Story