హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.. 'పంచ‌మి'గా నిధి అగ‌ర్వాల్‌

Nidhi Agerwal as Panchami in Harihara Veera Mallu. 'మున్నామైఖెల్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన చిన్న‌ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2021 1:53 PM IST
హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.. పంచ‌మిగా నిధి అగ‌ర్వాల్‌

'మున్నామైఖెల్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన చిన్న‌ది నిధి అగ‌ర్వాల్‌. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఇక 'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు ఇక్క‌డ దుమ్ములేపుతోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. నేడు నిధి అగ‌ర్వాల్ పుట్టిన రోజు. మంగ‌ళ‌వారం 28వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది.

కాగా.. అమ్మ‌డు న‌టిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్ల‌లో నిధి అగ‌ర్వాల్ ఒక‌రు కాగా మ‌రోక‌రు జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. కాగా.. మంగ‌ళ‌వారం నిధి అగ‌ర్వాల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'హరిహర వీరమల్లు' నుంచి నిధి అగర్వాల్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పంచ‌మి అనే పాత్ర‌లో నిధి అగ‌ర్వాల్ క‌నిపించ‌నుంది. నిండుగా చీర‌క‌ట్టుతో న‌గ‌లు సింగారించుకుని నాట్యం చేయ‌డానికి సిద్ధంగా ఉన్న పోజులో నిధి నిల్చుని ఉంది. 17వ శతాబ్దానికి చెంది మొఘల్‌ కాలం, కుతుబ్ షాహీ బ్యాక్‌డ్రాప్‌లో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Next Story