తనకు గుడికట్టడంపై స్పందించిన నిధి అగర్వాల్.. మూడు కోరికలను కోరింది.. అవేంటంటే..?
Nidhhi Agerwal's request to fans who built a temple for her. తనకు గుడికట్టడంపై నిధి అగర్వాల్ చాలా సంతోషపడడంతో పాటు ఓ మూడు కోరికలను నిధి కోరింది.
నిధి అగర్వాల్ పరిచయం అక్కరలేని పేరు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందం, అభినయంతో తెలుగు, తమిళం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. 'ఇస్మార్ట్ శంకర్'తో అమ్మడు బాగా పాపులర్ అయింది. నిధి ఇటీవల జయం రవి హీరోగా వచ్చిన 'భూమి' అనే సినిమాలో నటించి తమిళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది. ఈ సినిమాతో నిధి 'ఈశ్వరన్' అనే మరో సినిమాలోను నటించింది. దీంతో ఈ కన్నడ సోయగానికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజున) తమిళనాడులో నిధి అగర్వాల్‌కు గుడి కట్టి పాలాభిషేకాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిధి పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నిధి అగర్వాల్ చాలా సంతోషపడడంతో పాటు ఓ మూడు కోరికలను నిధి కోరింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది అమ్మడు. తన కోసం కట్టిన ఆ గుడిని గూడు లేనివారికి ఆశ్రయంగా ఇవ్వాలని కోరింది. అనాధలకు ఆకలి తీర్చడం, విద్యను అందించడం వంటి సేవా కార్యక్రమాలకు ఆ గుడిని వేదికగా చేసుకోవాలని ట్రస్ట్రీలను కోరింది. ఇంత మంచి అభిమానులు నాకు దక్కినందుకు సంతోషంగా ఫీలవుతున్నా అంటూ లేఖలో పేర్కొంది నిధి.