వేణు స్వామితో పూజలు చేయించిన మరో హీరోయిన్

Nidhhi Agarwal Performing Special Pooja At Her Home With Venu Swamy. వేణు స్వామి సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By M.S.R
Published on : 28 March 2023 4:56 PM IST

వేణు స్వామితో పూజలు చేయించిన మరో హీరోయిన్

వేణు స్వామి సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఎన్నో సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద కామెంట్లతో అందరినీ ఆకర్షించారు. అయితే ఆయనతో పూజలు చేయించుకుని దోషాలు నివారించుకోవాలని కూడా పలువురు ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో కూడా ఎంతో మంది ప్రముఖులకు ఆయన పూజలు చేశారు.

తాజాగా హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఇంట్లో పూజ‌లు, యాగం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నిధి అగర్వాల్ వేణుస్వామితో కలిసి తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు, యాగం నిర్వహించింది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాల్లో నటించిన నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. ఆమె కెరీర్ మరింత వేగంగా ముందుకు దూసుకువెళ్లాలని ఈ పూజలు చేయించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయ పడుతూ ఉన్నారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న కూడా వేణుస్వామితో పూజలు చేయించారు. ఇప్పుడు మరో హీరోయిన్ నిధి అగర్వాల్ పూజలు చేయించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకుల‌ గురించి ముందే చెప్పి బాగా పాపులర్ అయ్యారు వేణు స్వామి. ఆయన చేత పూజలు చేయిస్తే కలిసొస్తుంది అని కూడా నమ్మేవాళ్లు ఉన్నారు.


Next Story