కారు కొన్న బుల్లితెర న‌టి.. ధ‌ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Nia Sharma buys new luxury car. నాగిని 4 లో నటించిన బుల్లితెర న‌టినియా శర్మ కొత్త కారు కొనింది దాని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 2:00 PM GMT
Nia Sharma buys new luxury car.

నాగిని సీరియ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది. సీజన్1 నుంచి సీజన్ 4వరకు ప్రసారం అవుతూ మంచి విజయాన్ని సాధించింది. నాగిని 4 లో నటించిన నియా శర్మ ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్‌ ఇండియా' విజేతగా కూడా నిలిచారు. ఈ షోలో ఎంతో కష్టమైన టాస్క్ లలో పాల్గొంటూ ఎంతో ధైర్యంగా తన సాహసాలను ప్ర‌ద‌ర్శించింది. బోల్డ్ నటిగా పేరు సంపాదించుకున్న నియా శర్మ తాజాగా ఓ ఖరీదైన కారును కొంది. ఆ కారు ధర అక్ష‌రాల రూ. 87.90 లక్షలు(ఎక్స్‌- షోరూం). వోల్వో ఎక్స్‌సీ90 డీ5 ఇన్స్‌క్రిప్షన్‌ ఎస్‌యూవీ కొత్త మోడల్‌ను కొంది నియా శ‌ర్మ‌.

నియా శర్మ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. 'సంతోషాన్ని కొనుక్కోలేం. కానీ కార్లను కొనుక్కోవచ్చు వాటిలోని ఆనందం ఉంటుంది అంటూ' తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నెటిజన్లు పెద్దఎత్తున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్ల విషయానికి వస్తే ఎంతో సురక్షితంగా భావించే వోల్వో కంపెనీ కార్లపై ప్రముఖ సెలబ్రెటీలు ఎంతో మక్కువ చూపుతారు. దాదాపు బీ టౌన్ లో నివసించే సెలబ్రిటీల మొత్తం వివిధ రకాల కంపెనీలకు చెందిన ఉపయోగించడం గమనార్హం.

Advertisement


చాలా ఏళ్లుగా ఎక్స్‌సీ90 మోడల్‌ వోల్వో కార్లను భారత్‌లో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులో లోకల్‌ అసెంబ్లీ యూనిట్‌ను ప్రారంభించింది. తాజాగా ఈ కంపెనీకి సంబంధించిన వోల్వో ఎక్స్‌సీ90 డీ5 నియా శర్మ కొనుగోలు చేశారు. ఈమె కొన్న ఈ కారు డీజల్ వర్షన్ అని తెలిపారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.


Next Story
Share it