Adipurush : 'మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ '

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’.శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2023 2:53 AM GMT
Adipurush Movie, Prabhas

ఆదిపురుష్ చిత్రం నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయణం బ్యాక్ డ్రాప్ ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా కనిపించబోతున్నారు. టి-సిరీస్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే పూర్తి కాగా.. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

శ్రీరామ‌న‌వ‌మి పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. స‌రికొత్త పోస్ట‌ర్లు విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో సీతారాములుగా ప్రభాస్, కృతి కనిపిస్తుండగా పక్కన లక్ష్మణుడు.. అలాగే ఆంజనేయుడు కూడా ఉన్నారు. "మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్" అంటూ రాసుకొచ్చారు.ఈ పోస్ట‌ర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం స‌లార్‌. ఈ చిత్ర షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు.

Next Story