చేతబడి చేయిస్తా అంటూ యాంకర్‌ రష్మికి బెదిరింపులు

రష్మిని ఓ నెటిజన్‌ తీవ్ర బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఆ బెదిరింపుల స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేసిన

By అంజి  Published on  26 Feb 2023 6:00 PM IST
Anchor Rashmi , netizen threats, social media

యాంకర్‌ రష్మికి బెదిరింపులు

యాంకర్‌ రష్మి.. ఈ పేరు తెలుగువాళ్లకి ఎంతో సుపరిచితం. రష్మి పలు టీవీ షోల్లో యాంకర్‌గా చేస్తూనే, మరోవైపు నటిగానూ ఆమె ప్రేక్షకులను అలరిస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌ అంశాలపై స్పందిస్తుంటుంది. తనని విమర్శిస్తూ సెటైర్లు, కౌంటర్లు వేసే వారికి తనదైన శైలిలో జవాబిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిని ఓ నెటిజన్‌ తీవ్ర బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఆ బెదిరింపుల స్క్రీన్‌ షాట్‌ షేర్‌ చేసిన రష్మి.. దీనిపై ఫిర్యాదు చేయాలా? అని నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్టు పెట్టింది.

ఇటీవల హైదరాబాద్‌లో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యాంకర్‌ రష్మి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రష్మి ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రష్మిని పలువురు నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేశారు. ఆమెను బెదిరిస్తూ మెసేజ్‌లు చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ పంపిన బెదిరింపు మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను రష్మి పోస్ట్‌ చేసింది.

''నీ మీద చేతబడి చేయిస్తా. నువ్వు రోడ్డు మీద తిరగకు. ఇంట్లోనే ఉండు. నీ మీద యాసిడ్‌ పోస్తా. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు'' అంటూ అందులో బెదిరింపులు ఉన్నాయి. 'గతంలో ఈ నెటిజన్‌కు నా వయసు, పెళ్లి గురించి సమస్య ఉంది. ఇప్పుడు నాకు చేతబడి చేసి, యాసిడ్‌ పోయాలనుకుంటున్నాడు. నేనిప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలా..' అని రష్మి నెటిజన్ల సలహా కోరుతూ సదరు మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసింది. దీంతో రష్మి తాజా పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు ఇస్తున్నారు.


Next Story