అయ్యే ర‌కుల్ అలా అయ్యావేంటి

Netigens trolled Rakul Preet Singh.వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రకుల్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2021 7:45 AM GMT
అయ్యే ర‌కుల్ అలా అయ్యావేంటి

'వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్‌' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రకుల్. అగ్ర హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు పుల్ బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా త‌మిళం, హిందీ బాష‌ల్లోనూ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది. ఇదిలా ఉంటే.. రకుల్ ప్రీత్‌కి ఫిట్‌నెస్ అంటే మహా ఇష్టం. అందుకోసం ఏం చేయడానికైనా ఈ భామ సిద్ధంగా ఉంటుంది. గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. తన బాడీని స్లిమ్‌గా చేసుకుంది. మోతాదుకు మించి జిమ్ చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అంటూ వాళ్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. చాలా కాలంగా జరుగుతూనే ఉంది.

తాజాగా ఫొటో షూట్ చేయ‌గా, అందుకు సంబంధించిన ఫొటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ర‌కుల్ మొహంతో పాటు ఆమె శ‌రీరాకృతి వింత‌గా క‌నిపిస్తుంది. దీంతో నెటిజన్స్ ఆమెను ఆటాడుకుంటున్నారు. వెరైటీ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 'ఆ డ్రెస్ ఏంటీ.. నీ భంగిమలు ఏంటీ.. అసలు నీ అవతారం ఏంటీ' అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు.

Next Story
Share it