నెట్‌ఫ్లిక్స్‌పై మాజీ చెస్ ఛాంపియన్ పరువు నష్టం దావా

Netflix Must Face 'Queen's Gambit' Defamation Lawsuit From Chess Grandmaster.జార్జియన్ మాజీ మహిళా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 2:14 PM IST
నెట్‌ఫ్లిక్స్‌పై మాజీ చెస్ ఛాంపియన్ పరువు నష్టం దావా

జార్జియన్ మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ నోనా గప్రిందాష్విలి(80) ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై 5 మిలియన్ డాలర్లు ( భారత క‌రెన్సీలో దాదాపు రూ.38 కోట్ల) ప‌రువు న‌ష్టం దావా వేసింది. 'ది క్వీన్స్ గాంబిట్' సిరీస్‌లో త‌న టాలెంట్ గురించి త‌ప్పుగా చూపించార‌ని ఆరోపిస్తూ గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే దావా వేసింది. కాగా.. ఈ కేసు ఇటీవ‌ల న్యాయ‌స్థానంలో విచార‌ణ‌కు రాగా.. ది క్వీన్స్ గాంబిట్ సిరీస్‌లో నోనా కెరీర్‌లో 'ఎప్పుడూ పురుష ఆటగాళ్లని ఎదుర్కోలేదు' అని ఓ పాత్ర చెబుతోంది. అది తనను కించపరిచేలా ఉంద‌ని వాపోయింది. నిజానికి తాను 1968 నుంచే పురుషుల‌తో క్రీడాకారుల‌తో చెస్‌లో పోటి ప‌డిన‌ట్లు తెలిపింది.

దీనిపై నెట్‌ఫ్లిక్స్ తరపు న్యాయవాదులు వాద‌న‌లు వినిపించారు. ఇది కేవ‌లం క‌ల్పిత సిరీస్ మాత్ర‌మేన‌ని, యూఎస్ రాజ్యాంగంలోని మొద‌టి స‌వ‌ర‌ణ‌ని చూసి ఈ దావాను కొట్టి వేయాల‌ని న్యాయ‌స్థానాన్ని కోరారు. అయితే.. ఫెడరల్ న్యాయమూర్తి వర్జీనియా ఫిలిప్స్ వారి అభ్యర్థనను తోసిపుచ్చారు. క‌ల్పిత ర‌చ‌న అయిన‌ప్ప‌టికీ ఇందులో ప‌రువు న‌ష్టం సంబంధించిన అంశాల‌ను అంశాలను నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొక తప్పదు అని చెప్పారు.

అన్య టేలర్ జాయ్ నటించిన 'ది క్వీన్స్ గాంబిట్' 1983లో వాల్టర్ టెవిస్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఓ అనాథ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా ఎలా మారిందనేది కథ. క‌ల్పిత క‌థే అయిన‌ప్ప‌టికీ.. ఎన్నో నిజ జీవితంలో చెస్ ఛాంపియన్ల క్యారెక్టర్స్ ఇందులో కనిపిస్తాయి. అలాగే నోనా పాత్ర కూడా వస్తుంది. కాగా.. 1978లోనే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను అందుకుని ఆ గౌరవం దక్కించుకున్న మొదటి మహిళగా నోనా గప్రిందాష్విలి నిలిచింది.

Next Story