'ఆదిపురుష్'పై నిషేధాన్ని ఎత్తివేయాలన్న నేపాల్ కోర్టు

నేపాల్ కోర్టు గురువారం ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” సినిమాతో సహా హిందీ చిత్రాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

By అంజి  Published on  23 Jun 2023 5:55 AM GMT
Nepal court, Adipurush, Kathmandu mayor, Prabhas

'ఆదిపురుష్'పై నిషేధాన్ని ఎత్తివేయాలన్న నేపాల్ కోర్టు 

రిలీజైన మొదట్లో 'ఆదిపురుష్‌' బాక్సాఫీసు దగ్గర దుమ్ము దులిపింది. ఇప్పుడు మాత్రం కలెక్షన్లలో వేట నెమ్మదించింది. అయితే సినిమాపై వివాదాలు మాత్రం తగ్గడం లేదు. నేపాల్‌లో 'ఆదిపురుష్‌' సినిమాపై నిషేధం విధించిన విషయం తెలిసంది. అయితే తాజాగా నేపాల్ కోర్టు గురువారం ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” సినిమాతో సహా హిందీ చిత్రాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దేశ సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను నిలిపివేయవద్దని అధికారులకు చెప్పింది.

“ఆదిపురుష్” సినిమాలోని ఓ డైలాగ్‌లో సీతను “భారతదేశపు కుమార్తె” అని పేర్కొనడం వల్ల అన్ని హిందీ చిత్రాలపై నిషేధం విధించబడింది. దీనిని ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా ప్రకటించారు. కోర్టు ఆదేశాలను తాను పాటించనని, తాను ఎలాంటి శిక్షనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే నేపాల్ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యానికి సంబంధించిన విషయం కాబట్టి సినిమా ప్రదర్శనను అనుమతించబోనని బాలేంద్ర షా గురువారం చెప్పారు. సెన్సార్ బోర్డు నుంచి అనుమతి పొందిన సినిమాల ప్రదర్శనను నిలిపివేయరాదని పేర్కొంటూ పటాన్ హైకోర్టు న్యాయమూర్తి ధీర్ బహదూర్ చంద్‌తో కూడిన సింగిల్ బెంచ్ స్వల్పకాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

నేపాల్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ దుంగనా మీడియాతో మాట్లాడుతూ.. పిటిషనర్లు కోర్టు నుండి వ్రాతపూర్వక ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఆమోదించిన అన్ని సినిమాలను ప్రదర్శిస్తాం అని చెప్పారు. "ఆదిపురుష్", ఇతర హిందీ చిత్రాలను నేపాల్‌లో సోమవారం నిషేధించారు. ఆదిపురుష్‌ సినిమాలో డైలాగ్‌లపై వివాదం తలెత్తింది. సినిమాలో సీత (కృతి సనన్ పోషించినది) భారత కుమార్తె అని పేర్కొనబడింది. జానకి అని కూడా పిలువబడే సీత, ఆగ్నేయ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించిందని చాలామంది నమ్ముతారు.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో బాలేంద్ర షా "కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండను" అని అన్నారు. ఖాట్మండులో “ఆదిపురుష్” ని నిషేధించాలని ఖాట్మండు మేయర్ తీసుకున్న నిర్ణయం తర్వాత, ధరన్ మేయర్ హర్కా సంపాంగ్, పోఖరా మేయర్ కూడా సినిమాపై నిషేధం విధించారు. చివరికి నేపాల్ అంతటా “ఆదిపురుష్” స్క్రీనింగ్ నిలిపివేయడానికి దారితీసింది. టీ సిరీస్‌, Retrophiles, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే కూడా నటించారు.

Next Story