ఐకాన్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ

Neha Shetty shares screen space with Allu Arjun.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 12:14 PM GMT
ఐకాన్ స్టార్‌తో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 'పుష్ప' చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బ‌న్ని ప‌క్క‌న న‌టించే అవ‌కాశం కోసం బాలీవుడ్ హీరోయిన్ల‌తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌లకు సంబంధించిన క‌థానాయిక‌లు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఓ యువ న‌టికి ఆ అవ‌కాశం ద‌క్కింది. ఇటీవ‌ల విడుద‌లైన డీజే టిల్లులో త‌న న‌ట‌న‌, అందంతో అంద‌రిని ఆకట్టుకుంది నేహా శెట్టి. ఈ నేప‌థ్యంలోనే అమ్మ‌డు బంప‌ర్ ఆప‌ర్ ద‌క్కించుకుంది. బ‌న్నీతో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవ‌కాశాన్ని కొట్టేసింది. అయితే.. ఈ ఆఫ‌ర్ సినిమాలో కాదు ఒక యాడ్ లో.

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన యాడ్ కు సంబంధించిన జొమాటో కొత్త ప్రోమో విడుదలైంది. ఈ యాడ్ ను హైదరాబాద్ లోని ప్రముఖ నోవాటెల్ హోటల్ లో చిత్రీకరించారు. ప్ర‌స్తుతం ఈ యాడ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు.

Next Story
Share it