వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ మీద చాలా కాన్సట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఫిట్నెస్ ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే పలువురు సెలెబ్రిటీలు ఫిట్నెస్ పై దృష్టిసారిస్తూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవలోకే నటి ప్రగతి కూడా వస్తారు. తాను ఫిట్ గా ఉండాలని.. అలాగే తన ఫాలోవర్లను మోటివేట్ చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. తన వర్కౌట్ కు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా కూడా అలాంటి వీడియోను పోస్టు చేశారు నటి ప్రగతి. కానీ కొందరు పనిగట్టుకుని విమర్శించడం మొదలుపెట్టారు. ఆ కామెంట్లకు నటి ప్రగతి సరైన రిప్లై ఇచ్చారు.
ఆమె జిమ్‌లో చెమటోడ్చుతున్న వీడియోలను షేర్ చేసింది. కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ ఆమెను కించపరుస్తూ కామెంట్లు చేశారు. 'అక్కా.. ఎందుకే ఇంత కష్టం? కుస్తీ పోటీలకు ఏమైనా పేరు ఇచ్చావా?' అని వెటకారంగా ప్రశ్నించాడు. 'నీకు ఇలా నెగెటివ్ కామెంట్స్ పెట్టి డీమోటివేట్ చెయ్యటం ప్యాషన్ ఐతే... నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ ప్యాషన్.. మీకు నచ్చినట్లుగా కాదు, నాకు నచ్చినట్లు నేనుంటా' అని కౌంటర్ ఇచ్చింది. ఏది ఏమైనా ప్రగతి కరెక్ట్ గా రిప్లై ఇచ్చిందని చెబుతూ ఉన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు.. కానీ కొందరు మాత్రం ఇలా ఇతరులపై కామెంట్లు చేస్తూ గడిపేస్తూ ఉంటారు.