కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా.. రామ్ చరణ్‌కు జంటగా పూజ హెగ్డే కనిపించనుంది. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికరమైన కథతో సందేశాత్మక రీతిలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అన్ని అవాంతరాలు దాటుకుని ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడులైన ఈ చిత్ర టీజర్, 'లాహే లాహే' సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సెకండ్ సింగిల్ విడుదల చేసేందుకు చిత్ర బృందం టైంను ఫిక్స్ చేసింది. రామ్ చరణ్- పూజ హెగ్డే లపై చిత్రీకరించిన 'నీలాంబరి' మెలోడీ సాంగ్‌ను ఈ నెల 5న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.