ఆకట్టుకుంటున్న నీలాంబ‌రి సాంగ్ ప్రొమో

Neelambari Song promo Out from Acharya movie.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 8:59 AM GMT
ఆకట్టుకుంటున్న నీలాంబ‌రి సాంగ్ ప్రొమో

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో సిద్దా అనే కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. చ‌ర‌ణ్‌కు జోడిగా పూజా హెగ్డే నీలాంబ‌రి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా.. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈచిత్రం నుంచి విడులైన టీజ‌ర్‌, లాహే లాహే సాంగ్ ఆక‌ట్టుకున్నాయి.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌.. 'నీలాంబరీ' ప్రోమోను చిత్రం బృందం విడుద‌ల చేసింది. 'నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలామరీ.. నీలాంబరీ.. నీలాంబరీ.. నీ అందమే నీ అల్లరి' అంటూ ఈ పాట సాగుతోంది. రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకోగా.. పూజా హెగ్డే లుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇక పూర్తి పాటను రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.

Next Story
Share it