ఆచార్య మూవీ.. ఆక‌ట్టుకుంటున్న నీలాంబ‌రీ పాట‌

Neelambari lyrical song out from Acharya Movie.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 6:33 AM GMT
ఆచార్య మూవీ.. ఆక‌ట్టుకుంటున్న నీలాంబ‌రీ పాట‌

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో సిద్దా అనే కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. చ‌ర‌ణ్‌కు జోడిగా పూజా హెగ్డే నీలాంబ‌రి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా.. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈచిత్రం నుంచి విడులైన టీజ‌ర్‌, 'లాహే లాహే 'సాంగ్ ఆక‌ట్టుకున్నాయి.

దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌.. 'నీలాంబరీ' ప్రోమోను విడుద‌ల చేయాగా.. నేడు పుల్ పాట‌ను విడుద‌ల చేసింది. 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ ఈ పాట సాగుతోంది. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించ‌గా.. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకోగా.. పూజా హెగ్డే లుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓసారి ఈ పాట‌ను వినేయండి.


Next Story