వాల్తేరు వీర‌య్య : 'నీకేమో అందమెక్కువా నాకెమో తొంద‌రెక్కువ‌'

Neekemo Andam Ekkuva Lyrical from Waltair Veerayya.మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2023 1:04 PM IST
వాల్తేరు వీర‌య్య : నీకేమో అందమెక్కువా నాకెమో తొంద‌రెక్కువ‌

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'. బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టించింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈ శుక్ర‌వారం(జ‌న‌వ‌రి 13)న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. వ‌రుస అప్‌డేట్స్ విడుద‌ల చేస్తోంది. ఇప్ప‌టికే 'బాస్ పార్టీ', 'నువ్వు శ్రీదేశి అయితే', 'పూన‌కాలు లోడింగ్ 'వంటి పాటలు అభిమానుల‌ను అల‌రించాయి. ఇక ట్రైల‌ర్ అయితే సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచేసింది.

తాజాగా ఈ చిత్రంలోని ఆఖ‌రి పాట నీకేమో 'అందమెక్కువా.. నాకేమో తొంద‌రెక్కువ' లిరిక‌ల్ పాట‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సంగీతాన్ని అందించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసిన ఈ మెలోడి పాట‌కు చిరు గ్రేస్ క‌లిసి అదిరిపోయింది. ఫ్రాన్స్‌లోని అంద‌మైన లొకేష‌న్ల‌ల‌లో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story