షారుఖ్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో సోదాలు

NCB conducts raid at Shah Rukh Khan's home.డ్ర‌గ్స్ కేసులు ఇప్ప‌ట్లో బాలీవుడ్‌ను వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పటికే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2021 9:30 AM GMT
షారుఖ్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో సోదాలు

డ్ర‌గ్స్ కేసులు ఇప్ప‌ట్లో బాలీవుడ్‌ను వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా షారుఖ్ ఖాన్ కుమారుడు డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిరిగింది. షారుఖ్ ఖాన్ నివాసంలో ఎన్‌సీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం షారుఖ్ త‌న కుమారుడు ఆర్య‌న్ క‌లిసేందుకు ఆర్థ‌ర్ రోడ్ జైలుకి వెళ్లాడు. ఆయ‌న జైలు నుంచి తిరిగి వ‌చ్చిన కాసేప‌టికే బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్‌కు ఎన్‌సీబీ అధికారులు వ‌చ్చారు.

అలాగే.. బాలీవుడ్ యువ న‌టి అన‌న్యా పాండే నివాసంలోనూ ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ రోజు ఉద‌యం ఆమె నివాసానికి వెళ్లిన అధికారులు అక్క‌డ సోదాలు చేప‌ట్టారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని స‌మ‌న్లు జారీ చేశారు. సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్‌కు మంచి స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్‌సీబీ అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. డ్ర‌గ్స్ కేసులో ఆర్య‌న్‌కు రెండుసార్లు బెయిల్ తిరస్క‌రించారు. అక్టోబ‌ర్ 26న‌ బాంబే హై కోర్టు ఈ కేసును విచారించ‌నున్న‌ది. అప్ప‌టి వ‌ర‌కు ఆర్య‌న్ జైలులోనే ఉండ‌నున్నాడు.

Next Story