'భగవంత్ కేసరి'గా వచ్చేస్తోన్న బాలయ్య.. ఊచకోత షురూ
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటి వరకు ఉన్న
By అంజి
'భగవంత్ కేసరి'గా వచ్చేస్తోన్న బాలయ్య.. ఊచకోత షురూ
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్ష్‌కు చిత్రయూనిట్ తెరదించింది. సినిమా టైటిల్ విడుదల చేసింది. ఎన్‌బీకే 108వ సినిమాకు 'భగవంత్ కేసరి' అనే టైటిట్‌ను చిత్రయూనిట్ ఖరారు చేసింది. ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. టైటిల్‌తో పాటు బాలయ్య లుక్‌ను కూడా రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అన్న దిగిండు.. ఇక మాస్ ఊచకోత షురూ అంటూ ట్వీట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. టైటిట్ విడుదల కావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పోస్టర్‌లో చేతిలో గొడ్డలితో పవర్‌ఫుల్ లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నారు. ఇది చూసి నిజంగానే బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. టైటిల్ రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే.. టీజర్ రిలీజ్ ఎప్పుడు అని దర్శకుడు, చిత్రయూనిట్‌ని ఫ్యాన్స్ అడగడం మొదలుపెట్టారు.
ఈ సినిమాలో పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణను అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య ఎలా ఉంటాడో? చూడాలని ఫ్యాన్స్ ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన సినిమా టైటిల్, బాలయ్య లుక్ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేస్తుంది. 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. ఇక బాలయ్య స్నేహితుడిగా శరత్‌కుమార్ నటిస్తున్నాడు. సన్‌షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు బాక్సులు బద్ధలయ్యేలా బీజీఎం అందించిన థమన్ మరోసారి బాలయ్య కోసం అదిరిపోయే మాస్ బీట్స్ ఇస్తున్నాడు.
గిప్పడి సంది ఖేల్ అలగ్ 😎Extremely proud to present our Hero, The one & only #NandamuriBalakrishna garu in & as #BhagavanthKesari 💥#NBKLikeNeverBefore ❤️🔥@MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/bMXbhzDp6x
— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023