బాలయ్య సినిమాపై భారీ అంచనాలు పెంచే వార్తలివే..!

NBK 107 movie update.బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2022 12:03 PM IST
బాలయ్య సినిమాపై భారీ అంచనాలు పెంచే వార్తలివే..!

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్నాడు. బాలకృష్ణకి కరోనా రావడం వలన షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. వచ్చే వారం నుంచి షూటింగును మొదలుపెట్టనున్నారు. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే డిసెంబర్ ఫస్టు వీక్ లోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు.

ఇటీవల సినిమా నుండి విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ఫస్టాఫ్ లో వచ్చే ఫారిన్ ఫైట్ సూపర్ గా ఉంటుందని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ఇంతకుముందు బాలకృష్ణ సినిమాల్లో చూడని విధంగా డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు కూడా అభిమానులకు మరింత కిక్ ఇవ్వనుంది.

Next Story