బాలయ్య 107.. మైండ్ బ్లాకింగ్ మాస్ పోస్టర్ విడుద‌ల‌

NBK 107 mass poster released on NTR Jayanthi.నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోలిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2022 12:42 PM IST
బాలయ్య 107.. మైండ్ బ్లాకింగ్ మాస్ పోస్టర్ విడుద‌ల‌

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోలిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. బాల‌య్య కెరీర్‌లో 107వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న‌ ఈ మూవీలో విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా.. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్బంగా మైత్రీ మూవీ సంస్థ‌ మైండ్ బ్లోయింగ్ మాస్ పోస్టర్ ని విడుద‌ల చేసింది. ఇందులో చేతిలో కత్తి పట్టుకొని ఉన్న బాల‌య్య చాలా కోపంతో క‌నిపిస్తున్నారు. ఇది ఓ యాక్ష‌న్ స‌న్నివేశానికి సంబంధించిన‌దిగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

'విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, తెలుగు జాతి ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక శ్రీ నంద‌మూరి తార‌క రామారావు గారి శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హానీయుడిని స్మ‌రించుకుంటూ..#NBK107 మాస్ పోస్ట్ మీకోసం' అంటూ నిర్మాణ సంస్థ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఇక ఈ చిత్రంలో బాల‌య్య లుక్, ఆయ‌న పాత్ర ఎంతో ప‌వ‌ర్‌పుల్‌గా ఉండ‌నున్నాయి.

Next Story