నయన్ నిశ్చితార్థం అయిపోయినట్లేనా..?
Nayanthara Vignesh Shivan gets engaged.సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అయిన నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నిశ్చితార్థం
By తోట వంశీ కుమార్ Published on 25 March 2021 3:31 PM ISTసౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అయిన నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే..! ఇద్దరూ కలిసి టూర్లకు వెళ్లడం, ఒకే చోట ఉండడం వంటివన్నీ ఎప్పటికప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇక వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయిపోయిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అందుకు కారణం విఘ్నేష్ శివన్ పెట్టిన పోస్టు అని చెప్పొచ్చు.
విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో నయనతార చేయి అతడి గుండెల మీద ఉండగా ఆమె వేలికి ఉంగరం తొడిగి ఉంది. ఇది చూసిన అభిమానులు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ గింగిరాలు తిరుగుతోంది. 2015లో 'నానుమ్ రౌడీదాన్' సినిమా సమయంలో నయన్, విఘ్నేష్‌లు ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే..! పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది.
ఇక నయనతార వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుండగా.. విఘ్నేష్ శివన్ పలు క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ వస్తున్నాడు. ఇద్దరూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరి పెళ్లి ఎప్పుడన్నది కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.