గాడ్ ఫాదర్ నుంచి నయనతార లుక్.. అదిరిపోయింది అంతే

Nayanthara poster released from God Father movie.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాద‌ర్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2022 1:10 PM IST
గాడ్ ఫాదర్ నుంచి నయనతార లుక్.. అదిరిపోయింది అంతే

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాద‌ర్‌'. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం 'లూసిఫ‌ర్‌'కు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు త‌గ్గట్లుగానే ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంద‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు తెలియ‌జేశాడు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

దీంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ చిత్రం నుంచి వ‌రుస అప్‌డేట్‌లు విడుద‌ల చేస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. అందులో భాగంగా నేడు న‌య‌న‌తార పాత్ర‌ను తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో ఆమె స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్‌గా క‌నిపించ‌నుంది. లూసీఫ‌ర్‌లో మంజు వారియ‌ర్ పోషించిన పాత్ర‌ను న‌య‌న‌తార పోషిస్తోంది. ఈ పోస్ట‌ర్‌లో న‌య‌న్ ఏదో సీరియ‌స్‌గా టైపింగ్ చేస్తూ క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక ఈ చిత్రంలో న‌య‌న‌తార చిరుకు చెల్లెలిగా న‌టిస్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్‌, ఆర్.బి.చౌద‌రి, ప్ర‌సాద్ ఎన్‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స‌త్య‌దేవ్‌ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Next Story