న‌య‌న‌తార‌-విగ్నేష్ శివ‌న్ పెళ్లి ఇక్క‌డ కాదా..? వెడ్డింగ్ కార్డు వైర‌ల్‌..?

Nayanthara and Vignesh Shivan wedding invitation goes viral.స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌, త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2022 5:52 AM GMT
న‌య‌న‌తార‌-విగ్నేష్ శివ‌న్ పెళ్లి ఇక్క‌డ కాదా..?  వెడ్డింగ్ కార్డు వైర‌ల్‌..?

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌, త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మొత్తానికి వీళ్లు పెళ్లితో ఒక్కటవ్వాలని డిసైడయ్యారు. క‌రోనా స‌మ‌యంలోనే త‌మ నిశ్చితార్థ‌మైపోయింద‌ని ఇటీవ‌ల ఓ చిత్ర ప్ర‌మోష‌న‌ల్‌లో న‌య‌న్ వెల్ల‌డించింది. దీంతో న‌య‌న్ పెళ్లి ఎప్పుడంటూ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తుండ‌గా.. జూన్ 9న వీళ్ల పెళ్లి జరగనుంది. కాగా.. వీరి వివాహాం తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో జ‌ర‌గ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగ‌గా.. తాజాగా వేదిక మారినట్లు తెలుస్తోంది.

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని, ఇరు కుటుంబాల్లో ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే కొంద‌రు అతిథుల‌కు డిజిట‌ల్ వీడియో ఇన్విటేష‌న్ కార్డ్‌ని కూడా ఈ జంట పంపించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ వెడ్డింగ్ కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ ఇన్విటేష‌న్ ప్ర‌కారం వీరి వివాహాం జూన్ 9న మ‌హాబ‌లిపురంలోని మ‌హ‌బ్ హోట‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. కేవలం కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య వీరి వివాహాం జ‌ర‌గ‌నుంది. ఇక ఇండ‌స్ట్రీలోని పెద్ద‌లు, మిత్రుల‌ కోసం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్ష‌న్‌ను జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Next Story
Share it