శ్రీవారి స‌న్నిధిలో న‌య‌న్‌-విఘ్నేశ్ పెళ్లి..?

Nayanthara and Vignesh Shivan Marriage date and Venue fixed.లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ శివన్‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2022 11:47 AM IST
శ్రీవారి స‌న్నిధిలో న‌య‌న్‌-విఘ్నేశ్ పెళ్లి..?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది వీరిద్ద‌రికి నిశ్చితార్థ‌మైంది. ఇక వీరిద్ద‌రు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏడేళ్ల ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి సాధ్య‌మైనంత త్వ‌ర‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది ఈ జంట‌. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో ఏడ‌గులు వేయ‌నున్నారట‌.

జూన్ 9 న పెళ్లి చేసుకునేందుకు మూహూర్తం నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వివాహం అనంత‌రం చెన్నైలో స్నేహితులు, సెల‌బ్రెటీల కోసం గ్రాండ్ గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. ఈ మేర‌కు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నార‌ని ఆ వార్త‌ల సారాంశం. అయితే.. దీనిపై ఇటు విఘ్నేశ్ కానీ, అటు న‌య‌న‌తార కానీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు శ్రీవారిని ఈ జంట ద‌ర్శించుకుంది. విఐపీ బ్రేక్ ప్రారంభ ద‌ర్శ‌న స‌మ‌యంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ద‌ర్శ‌న అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేయ‌డంతో పాటు ఆశీర్వ‌చ‌నాలు ఇచ్చారు.

'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌కు విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమగా మారింది. తాజాగా విఘ్నేశ్‌ దర్శకత్వం వహించిన 'కాతు వాకుల రెండు కాదల్‌' చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. విజయ్‌ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకోవ‌డంతో న‌య‌న్‌-విఘ్నేశ్ గ‌త కొద్ది రోజులుగా దేశంలోని ప్ర‌ముఖ దేవాల‌యాల‌కు వెళ్లి వ‌స్తున్నారు.

Next Story