పెళ్లికి సీఎంను ఆహ్వానించిన న‌య‌న‌తార-విఘ్నేష్‌శివ‌న్‌

Nayanthara and Vignesh Shivan invite CM Stalin to their wedding.కోలీవుడ్ ప్రేమ జంట హీరోయిన్ న‌య‌న‌తార, ద‌ర్శ‌కుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 11:40 AM IST
పెళ్లికి సీఎంను ఆహ్వానించిన న‌య‌న‌తార-విఘ్నేష్‌శివ‌న్‌

కోలీవుడ్ ప్రేమ జంట హీరోయిన్ న‌య‌న‌తార, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌లు త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్కబోతున్నారు అనే వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రూ కూడా ఈ వార్త‌ల‌ను ఎక్క‌డా అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వారి పెళ్లి వేడుక‌కు ఏర్పాట్లు చ‌క చ‌కా సాగిపోతున్నాయి. అతి కొద్ది మంది స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీరి వివాహాం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఈ జంట త‌మ పెళ్లి ప‌త్రిక‌ల‌ను పంచ‌డం ప్రారంభించారు.

తమిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను త‌మ‌పెళ్ళికి ఆహ్వానించారు. ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, ఆయ‌న కుమారుడు హీరో, నిర్మాత ఉద‌య నిధి స్టాలిన్‌ను క‌లిసి త‌మ వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేసి పెళ్లికి హాజ‌రు కావాల్సిందిగా కోరారు. ఈ సంద‌ర్భంగా సీఎం స్టాలిన్ ఈ జంట‌ను అభినందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఏడేళ్ల నుంచి న‌య‌న్‌, విఘ్నేశ్ లు ప్రేమ‌లో ఉన్నారు. గ‌తేడాది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. జూన్ 9న మ‌హాబ‌లిపురంలోని మ‌హ‌బ్ హోట‌ల్‌లో వీరి వివాహాం జ‌ర‌గ‌నుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన 'కాతువ‌క్క‌ల రెందు కాద‌ల్' చిత్రానికి విఘ్నేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార టాలీవుడ్‌లో చిరంజీవితో 'గాడ్ ఫాద‌ర్' చిత్రంలో న‌టిస్తున్నారు.

Next Story