చాలాకాలంగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లితో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే వీరికి పెళ్లి ఐదు నెలలు కూడా కాలేదు.. అప్పుడే పిల్లలు ఎలా పుట్టారని ప్రశ్నలు తలెత్తాయి. దీంతో అసలు వివాదం మొదలైంది. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో కవలలు జన్మించడంతో నెటిజన్లు వీరిపై సీరియస్ అవుతున్నారు.
భారత్‌లో సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో నయనతార - విఘ్నేశ్ దంపతులు చట్టాన్ని అతిక్రమించారంటూ నెటిఝన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు పిల్లలు ఎలా పుట్టారో పూర్తి వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసులపై నయన్ జంట ఇంకా స్పందించలేదు. కానీ తాజాగా విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టి.. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
''అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అంతవరకు ఓపికపట్టండి.. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి'' అంటూ స్టోరీలో షేర్ చేశారు. ప్రస్తుతం విఘ్నేశ్ పెట్టిన ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివాదంపై నయన్ దంపతులు నేరుగా స్పందించేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది.
https://instagram.com/stories/wikkiofficial/2946862826087330334?igshid=MDJmNzVkMjY=