మాల్దీవుల బ్యాచ్ పై ఫైర్ అయిన నవాజుద్దీన్

Nawazuddin Siddiqui slams celebs vacationing in the Maldives. ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది.విహార యాత్రలకు వెళుతూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్‌ చేస్తున్న స్టార్స్ పై నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  26 April 2021 2:19 PM IST
Nawazuddin Siddiqui

ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. అయితే ఈ సమయాల్లో కొందరు సెలెబ్రిటీలు మాల్దీవులకు, విహార యాత్రలకు వెళుతూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ తామేమి చేస్తూ ఉన్నామో.. ప్రతి ఒక్కటీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇలాంటి సెలెబ్రెటీలకు కొంచెం కూడా మనస్సాక్షి అన్నదే లేదని విమర్శలు వస్తున్నాయి. సామాజిక బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి స్టార్స్ పై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్ అయ్యారు.

విహార యాత్రలకు వెళుతూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్‌ చేస్తున్న స్టార్స్ పై నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడిందని.. వీళ్లు మాత్రం విహార యాత్రలకు వెళ్లడమే కాకుండా.. ఎంజాయ్‌ చేస్తూ, ఫొటోలను షేర్‌ చేయటంలో బిజీగా ఉన్నారన్నారు. ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే... డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలని విమర్శించారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇటీవల విహారయాత్రలకు వెళ్లొచ్చారు. ఇంకొందరు అక్కడే ఉన్నారు కూడానూ.. అలాంటి వారిపై నవాజుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story