'కష్టపడ్డా.. స్కిట్లు రాసినా'.. మంత్రి మల్లారెడ్డి స్టైల్లో నవీన్ పోలిశెట్టి స్పీచ్
నవీన్ పోలిశెట్టి.. అనుష్కతో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో తనదైన స్టయిల్లో ముందుకెళ్తున్నాడు.
By అంజి Published on 13 July 2023 7:46 AM IST
'కష్టపడ్డా.. స్కిట్లు రాసినా'.. మంత్రి మల్లారెడ్డి స్టైల్లో నవీన్ పోలిశెట్టి స్పీచ్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్ర చేసిన నవీన్ ఆ తర్వాత.. మహేశ్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో కూడా ఓ పాత్రలో నటించాడు. తరువాత బాలీవుడ్ వెళ్లి అక్కడ కొన్ని వీడియోస్ చేసాడు. బాగా పాపులర్ అయ్యాడు. అక్కడ ఓ సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' అనే మూవీతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక కోవిడ్ తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు’ హిట్ తో అతని స్టార్డమ్ ఒక్కసారిగా మారిపోయింది.
ప్రస్తుతం నవీన్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో విడుదల కానుంది ఈ క్రమంలోనే సినిమా ప్రచారాన్ని నవీన్ తన భుజాలపై వేసుకొని రెండు రాష్ట్రాల్లో విపరీతంగా పర్యటిస్తూ తన సినిమా గురించి చెప్తున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్ మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ మంత్రి మల్లారెడ్డిని అనుకరిస్తూ నవీన్ చేసిన స్పీచ్ విద్యార్థులను ఎంతగానో అలరించింది. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్.. పాలమ్మినా.. పూలమ్మినా.. సక్సెస్ అయినా తరహాలో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు.
''మీ పెద్దాయన మల్లారెడ్డి సర్ ఉంటారేమో అనుకొని వచ్చాను. అయన స్టైల్ గానీ, స్పీచ్ గానీ అంటే నాకు చాలా ఇష్టం" అంటూ అయన స్టైల్ లో చెప్పుకొచ్చాడు. "కష్ట పడ్డా. ఇన్ని హిట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లచ్చినాయి, నేనేమైన మాయ జేషినానా, మంత్రం జేషినానా, కష్ట పడ్డా, స్కిట్లు రాషినా, యూట్యూబ్ లో వీడియోలో జేషినా, అనుష్కతో హీరో గా జేషినా.. సక్సెస్ అయినా'' అంటూ మంత్రి మల్లారెడ్డి ఇమిటేట్ చేస్తూ నవీన్ పోలిశెట్టి స్పీచ్ ఇచ్చాడు. దీంతో అక్కడ స్టూడెంట్స్ అందరూ నవీన్ స్పీచ్‌కి ఫిదా అయ్యి క్లాప్స్ కొట్టారు.
#NaveenPolishetty imitates Telangana Minister Malla Reddy!#MissShettyMrPolishetty#MSMPonAug4th pic.twitter.com/dUPz1odfC8
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 12, 2023
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేశ్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.