తండ్రైన న‌వీన్ చంద్ర‌.. చిన్నారి పాదాన్ని ముద్దాడుతూ

టాలీవుడ్ న‌టుడు న‌వీన్ చంద్ర తండ్రి అయ్యాడు. త‌నకు పుట్టిన బిడ్డ‌ను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2023 8:41 AM IST
Actor Naveen Chandra,Naveen Chandra couples blessed baby boy,

తండ్రైన న‌వీన్ చంద్ర‌


హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్న న‌టుడు న‌వీన్ చంద్ర. ఆయ‌న‌ నిజ జీవితంలో ప్ర‌మోష‌న్ పొందాడు. బుధ‌వారం ఈ న‌టుడు తండ్రి అయ్యాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అత‌డే సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. బాబును ఎత్తుకుని ఆనందంతో ఉన్న ఫోటోల‌ను పంచుకున్నాడు. " నేను, ఓర్మా కుమారుడితో ఆశీర్వ‌దించ‌బ‌డ్డాము." అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం నవీన్ చంద్ర ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. విష‌యం తెలిసిన ప‌లువురు సినీ న‌టులు, అభిమానులు, నెటీజ‌న్లు న‌వీన్ చంద్ర దంప‌తుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. న‌వీన్ చంద్ర త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని షేర్ చేసుకునేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌డు. మ్యారేజ్‌, భార్య‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. గ‌తేడాది వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా.. త‌నలో స‌గం అంటూ త‌న భార్య ఓర్మాని ప‌రిచ‌యం చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌ల‌తోనూ న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. హీరోగా నవీన్ చంద్ర ఓ బై లింగ్విల్ మూవీ చేస్తున్నాడు.

Next Story