ఏపీలో థియేటర్ల కంటే కిరాణా షాపు కలెక్షన్స్ ఎక్కువ.. నాని సంచలన వ్యాఖ్యలు
Natural Star Nani Sensational comments on AP Ticket rates.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గించిన
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2021 7:42 AMఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికీ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొ రకంగా స్పందిస్తున్నారు. కాగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని నటించిన 'శ్యామ్‌సింగరాయ్' చిత్రం రేపు(డిసెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని ఏపీ టికెట్ రేట్ల విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఇటీవల తాను ఏదీ మాట్లాడినా వివాదం అవుతుందని.. కాని తప్పని సరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుందన్నారు. రాజకీయనాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఎవరూ కోరకపోయిన టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ కంటే.. పక్కనే ఉండే కిరాణా షాపుకు అత్యధిక ఆదాయం వస్తోందన్నారు. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారు.
ఇక 'శ్యామ్‌సింగరాయ్' సినిమా విషయానికి వస్తే.. రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఒక్క హిందీ బాషలో తప్ప దక్షిణాది బాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలలో ఈ చిత్రం విడుదల కానుంది.