బిగ్‌బాస్ ఇంటిని వీడనున్న నటరాజ్ మాస్టర్..?
Natraj Master may be eliminated from Bigg Boss telugu 5.చూస్తుండగానే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నాలుగో వారం ముగింపుకు
By తోట వంశీ కుమార్ Published on 3 Oct 2021 3:13 AM GMT
చూస్తుండగానే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నాలుగో వారం ముగింపుకు వచ్చేసింది. తొలి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరిలు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, కాజల్, ప్రియ, లోబో, అనీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. కాగా.. శనివారం నాటి ఎపిసోడ్‌లో రవి, సన్నీ, కాజల్, ప్రియ సేఫ్ అని నాగార్జున చెప్పేశారు. ఇక లోబో, అనీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
వీరిలో అందరి కంటే తక్కువగా నటరాజ్ మాస్టర్‌కు ఓట్లు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. హౌజ్‌లోని వాళ్లని జంతువులతో పోలుస్తూ.. అటు హౌజ్‌మేట్స్‌తో పాటు ఇటు ప్రేక్షకులకు చాలా చిరాకు తెప్పిస్తున్నాడని.. అందుకే ఈ వారం ఖచ్చితంగా అతడే ఎలిమినేట్ కానున్నాడని లీక్ వీరులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా లీక్‌వీరులు చెప్పినవి నిజం అయ్యాయి. అయితే.. నజరాజ్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడా లేదా అని తెలియాలంటే.. నేటి(ఆదివారం) నాటి ఎలిసోడ్‌లో తేలిపోనుంది.