యూట్యూబర్లకు నాతిచరామి మూవీ టీమ్‌ వార్నింగ్.. ఎందుకంటే

Nathi Charami movie team strong warning to Youtubers.పూనమ్‌ కౌర్‌, అరవింద్‌ కృష్ణ, సందేశ్‌ బురి ప్రధాన పాత్రల్లో నటించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 6:55 AM GMT
యూట్యూబర్లకు నాతిచరామి మూవీ టీమ్‌ వార్నింగ్.. ఎందుకంటే

పూనమ్‌ కౌర్‌, అరవింద్‌ కృష్ణ, సందేశ్‌ బురి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నాతిచరామి'. శ్రీలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై జై. వైష్ణవి కె నిర్మించిన ఈ చిత్రానికి నాగు గవర దర్శకత్వం వహించారు. ఓటీటీ వేదిక‌గా ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టి పూన‌మ్ కౌర్ మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అవ్వ‌డం జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ట్రైల‌ర్‌లోని ఫోటోల‌ను వాడుకొని కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ లో ఉపయోగించిన విధానం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాతిచరామి టీం యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చింది. 'యూట్యూబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తాజాగా జరిగిన నాతిచరామి మూవీ ప్రెస్ మీట్ వీడియోలపైన ఎవరైతే అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ వాడారో.. వారందరి థంబ్ నెయిల్స్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాము. సో మాట్లాడని విషయాలను వక్రీకరించి థంబ్ నెయిల్స్ పెట్టిన అందరిపైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము' అంటూ ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్‌లో ఎమోష‌న‌ల్ అయిన పూనమ్ కౌర్ ఫొటోలను వాడుకుని.. 'నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతా అనుకున్నా'.. 'ఆడదాన్ని అలా నాశనం చేస్తే వాడు నాశనం అయిపోతాడు' అంటూ కొంద‌రు యూట్యూబ‌ర్స్ ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టారు.

Next Story