'మా ఎన్నికలు' ప్రకాశ్‌రాజ్‌ vs నరేష్‌

Naresh counter reply Prakash Raj tweeet about election.మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేష‌న్‌(మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2021 6:50 AM GMT
మా ఎన్నికలు ప్రకాశ్‌రాజ్‌ vs నరేష్‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేష‌న్‌(మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగేట‌ట్లు క‌నిపిస్తోంది. మా అధ్య‌క్ష బ‌రిలో ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్యాన‌ల్ ప్ర‌క‌టించారు ప్ర‌కాశ్‌రాజు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే సినీ పెద్దల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుండటంతో మా ఎన్నిక అంశం ఆసక్తికరంగా మారాయి. ఇక ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌కాశ్ రాజు, ప్ర‌స్తుత మా అధ్య‌క్షుడు న‌రేష్ వార్ న‌డుస్తోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఎలక్షన్స్ ఎప్పుడు ? #Justasking అంటూ ప్రకాష్ రాజ్‌ చేసిన ట్వీట్‌ మాలో మరోసారి హీట్‌ పెంచేశాయి. ఇందుకు బదులుగా నరేశ్‌.. జనరల్ బాడీ మీటింగ్‌లో ఎన్నికలపై ఒక తీర్మానం చేద్దామనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా జనరల్ బాడీ మీటిగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాం. మెయిల్‌ కూడా పంపించాం. ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్‌లో దూకుతాను అన్నట్టుగా ఉంది. మా నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయండి సార్‌' అంటూ నరేష్‌ ఘాటు రిప్లై ఇచ్చారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


Next Story
Share it