తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటెన్ విడుదల
Narayana Hrudayalaya hospital Released latest Taraka Ratna Health Bulletin.నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా
By తోట వంశీ కుమార్
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
"తారకరత్న ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మీడియాలో ప్రచారం అవుతున్నట్లు ఆయనకు ఎక్మో వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఆయనకు అత్యున్నత స్థాయి చికిత్స అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిపై సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం." అని హెల్త్ బులెటెన్ లో నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.
అంతకు ముందు తారక రత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. తన అన్న కుమారుడు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. శరీరంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని, తీవ్ర గుండెపోటు వల్ల నరాల వ్యవస్థ దెబ్బతిందన్నారు. రికవరీకి కాస్త సమయం పడుతుందని చెప్పారు. తాను ఇలాంటి స్థితిని ఎదుర్కొన్న వాడినేనని, మంచి వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందుతోందన్నారు.
ఇటీవల కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తొలుత ఆయన్ను కుప్పంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను పరామర్శిస్తూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.