'నార‌ప్ప' ట్రైల‌ర్‌.. వెంకీ మామ అద‌ర‌గొట్టేశాడు

Narappa Trailer out now.విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'నారప్ప‌'. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం “అసురన్” కి '

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2021 7:16 AM GMT
నార‌ప్ప ట్రైల‌ర్‌.. వెంకీ మామ అద‌ర‌గొట్టేశాడు

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'నారప్ప‌'. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం "అసురన్" కి రీమేక్ గా ఈచిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెంక‌టేష్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికి క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూసివేయ‌డంతో విడుద‌ల కాలేదు. చాలా కాలం చ‌ర్చ‌ల అనంత‌రం ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సురేష్ ప్రొడెక్ష‌న్స్ ప‌తాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

భూమి కోసం పోరాటం చేసే వ్య‌క్తిగా వెంక‌టేష్ న‌ట‌న చూస్తుంటే.. రొమాలు నిక్క‌బొడ‌వ‌డం ఖాయం. వెంకీ మామ నటన అంటే ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ చాలా కాలం అనంతరం ఫుల్ మీల్స్ పెట్టే సినిమాలా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ చూపిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. రెండు షేడ్స్ లో కూడా వెంకటేష్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ కనబరిచారు. ఇంకా మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సామ్ కే నాయుడు కెమెరా వర్క్ కానీ ఈ ట్రైలర్ కి మరో అదనపు హంగుని తీసుకొచ్చాయి. జులై 20న ఈచిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.

Next Story
Share it